తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసింది. 2019 డిసెంబర్ నెలకు సంబంధించి మొత్తం 68,466 టికెట్లను విడుదల చేసింది. ఎలక్ట్రానికర్ లాటరీ విధానం కింద 6,516 సేవాటికెట్లు, సుప్రభాతం 3856, తోమాల 60, అర్చన 60, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2,300 టికెట్లను విడుదల చేసింది. కరెంటు బుకింగ్ కింద మరో 61,950 ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. విశేష పూజా 2,500, కల్యాణోత్సవం 13,775, ఊంజల్ సేవ 4,350, ఆర్జిత బ్రహ్మూెత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ కోసం 17,400 టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.













