High Court: టీటీడీ అధికారుల తీరుపై .. హైకోర్టు అసహనం

తిరుమల పరకామణి (Tirumala Parakamani) చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) లో విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ (CID) సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవో (TTD EO) పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. లేని పక్షంలో రూ.20 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు టీటీడీ సమయం కోరింది. ఇందుకు సమయమిస్తూ విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 27కు వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో తిరుమల పరకామణిలో చోరీ కేసు నమోదైంది. ఈ ఘటనపై 2023లోనే టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు అందింది.