తిరుమలలో నవరాత్రి బ్రహ్మూెత్సవాలు
తిరుమలలో నవరాత్రి బ్రహ్మూెత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. 9వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలకు నాంది పలికేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. 10న రాత్రి పెద్దశేష వాహనంపై స్వామి ఊరేగడంతో బ్రహ్మూెత్సవాలు మొదలువుతాయి. 8వ రోజు ఉదయం మహారథం బదులు, స్వరరథ ఊరేగింపు ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. 9 రోజులూ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, ఎస్డీ సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.













