టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 1, 7, 8, 14, 15వ తేదీల్లో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిమరుల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు.













