Tidco : త్వరలో అమరావతిలో సమావేశం : అజయ్‌కుమార్
వచ్చే ఏడాది సంక్రాంతి (Sankranti) నాటికి పెండిరగ్ టిడ్కో ఇళ్ల (Tidco houses )లో గృహ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ (Vemulapati Ajay Kumar) తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చర్యల వల్లే టిడ్కో గృహ సముదాయాల్లో సమస్యలు నెలకొన్నాయని చెప్పారు. రూపాయికే ఇల్లు ఇస్తామన్న వైసీపీ మాట తప్పిందన్నారు. బ్యాంకుల వాయిదాలు (Bank installments) చెల్లించలేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రవేశాలు జరిగిన చోట మౌలిక వసతులు లేవు. వీటి పరిష్కారంపై దృష్టి సారించాం. సంబంధిత శాఖల అధికారులతో త్వరలో అమరావతి (Amaravati) లో సమావేశం నిర్వహిస్తాం అని తెలిపారు.













