Rajya Sabha: రాజ్యసభ సభ్యులుగా ముగ్గురి ప్రమాణ స్వీకారం
రాజ్యసభకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ సభ్యులు సానా సతీష్‌బాబు (Sana Satishbabu) , బీద మస్తాన్రావ్ (bida mastanrao), బీజేపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయ్యాక రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) సమక్షంలో వారు పదవీ ప్రమాణం చేశారు. సానా సతీష్, ఆర్ కృష్ణయ్యలు తెలుగులో, బీద మస్తాన్ రావు ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. అనంతరం వారు చైర్మన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.













