ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ డీజీ కోసం అన్వేషణ
ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ డీజీ కోసం అన్వేషణ మొదలైంది. ఇంటెలిజెన్స్ డీజీ నియామకం కోసం ముగ్గురు అధికారుల పేర్లను సీఎస్.. ఈసీకి పంపించారు. ముందు వరసులో నళినీ ప్రభాత్(1992 బ్యాచ్), కుమార్ విశ్వజిత్ (1994 బ్యాచ్) మహేష్ చంద్ర లడ్డా (1998 బ్యాచ్) ఉన్నారు. ఈ పేర్లను ఎన్నికల సంఘానికి పంపించారు. రేపటిలోగా ఇంటెలిజెన్స్ చీఫ్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిదే.













