ఓకే బరిలో ముగ్గురు రామచంద్రులు..
ఈసారి జరగబోయే ఎన్నికలలో యాదృచ్ఛికంగా ఒక వింత చోటు చేసుకుంది. ఒకేసారి బరిలో ముగ్గురు రామచంద్రులు దిగుతున్నారు. అయితే ఈ ముగ్గురు వేరువేరు పార్టీల నుంచి దిగుతున్నారు. దీంతో ఈ త్రిముక పోరు చాలా ఆసక్తిగా మారబోతుంది.. ఇంతకీ ఈ వింత జరిగేది పుంగనూరు నియోజకవర్గం లో కావడం విశేషం. ఒకే పేరుతో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఈసారి ఎన్నికల బరిలో ఎక్కడ నుంచి దిగుతున్నారు. అధికార వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. కూటమి అభ్యర్థిగా చల్లా రామచంద్రా రెడ్డి.. బీసీవై పార్టీ నుంచి స్థానిక నాయకుడు బోడే రామచంద్ర యాదవ్.. ఒకేసారి ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. ముగ్గురి అభ్యర్థుల పేర్లు ఒకటే అయినప్పటికీ ఇంటిపేర్లు మారుతున్నాయి. కానీ సామాన్య ఓటరికి ఈ పేర్లు కన్ఫ్యూషనే అని చెప్పాలి. కాస్త చదువుకున్న వాళ్ళ పరిస్థితి పర్లేదు కానీ చదువుకొని ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కన్ఫ్యూజన్లో ఒకరికి వేయాల్సిన ఓట్లు ఒకరికి వెళితే ఇక అంతే పరిస్థితి.













