మూడు రాజధానులకు మద్దతుగా.. విశాఖ గర్జన
విశాలో రాజధాని కావాలని విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆకాంక్షను వెలిబుచ్చారని మంత్రులు వైసీపీ నేతలు అన్నారు. అమరావతితో పాటుగా విశాఖ, కర్నూలును రాజధానులుగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పానికి ఈ గర్జన ద్వారా ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారని చెప్పారు. అధికార వికేంద్రీకరణకు 3 రాజధానుల సూత్రం బాగా పని చేస్తుందన్న నేతలు, దీనికోసం భవిష్యత్తులో ప్రజలు నినదించేలా కార్యక్రమాలు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ర్యాలీ పూర్తయిన తర్వాత పార్క్ హోటల్ జంక్షన్ వైఎస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, రోజా, కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు.













