Thiruvur :మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ (David) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్టీ కోసం కష్టపడి తనను అక్రమ కేసులతో వేధిస్తున్నారని, ఆత్మహత్యాయత్నానికి ముందు డేవిడ్ సెల్ఫీ వీడియో (Selfie video) తీసుకున్నాడు. ప్రస్తుతం అతను విజయవాడ (Vijayawada)లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డేవిడ్ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో బయటకు రాకుండా కొలికపూడి నిన్న అందరినీ బెదిరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.













