MLC: ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వీరే!
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ(MLC) స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో బరిలో ఉన్న కొణిదల నాగేంద్రరావు(Nagendra Rao), బీద రవిచంద్ర(Ravichandran), బి. తిరుమల నాయుడు(Tirumala Naidu), కావలి గ్రీష్మ ప్రసాద్(Grisma Prasad) , సోము వీర్రాజు (Somu Veerraju) ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.













