టీడీపీకి తగలబోతున్న దెబ్బలు ఇవే…?
తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు చాలామంది నాయకులు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తమను టార్గెట్ చేస్తారో అని భయపడిన చాలామంది నాయకులు బయటకు వెళ్లి పోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళడానికి కొంతమంది సిద్ధమవుతున్నట్టు సమాచారం. అధికార వైసీపీ లోకి వెళ్ళడానికి కొంత మంది భయపడుతున్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి తో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యే గత వారం పది రోజుల నుంచి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించక పోవడం అలాగే పార్టీ నేతల పైన కేసులు నమోదు చేస్తూ ఉండడంతో తాను ఆర్థికంగా ఎక్కడ ఇబ్బంది పడతానో అని భావిస్తున్న సదరు నేత ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన కొంతమంది సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
త్వరలోనే సుజనాచౌదరిని మరోసారి కలిసి హైదరాబాద్ లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న సదరు నేత గతంలో తెలుగుదేశం పార్టీని వీడాలని భావించిన చంద్రబాబు నాయుడు భరోసా కల్పించడంతో ఆయన వెనక్కు తగ్గారు. ఇప్పుడు మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదని సమాచారం. అలాగే మరో నాయకుడు కూడా ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన బిజెపి రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ తో చర్చలు జరిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అలాగే కర్నూలు జిల్లాకు చెందిన ఒక బలమైన కుటుంబం కూడా బీజేపీ లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వాళ్లు కూడా సుజనా చౌదరితో ఉన్న మంచి సంబంధాలు నేపథ్యంలో ఆయనతో మాట్లాడుతున్నారని త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయాన్ని పార్టీ లో ఉన్న తన సన్నిహితులతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. చంద్రబాబు నాయకత్వం పై భరోసా లేని కొంతమంది నేతలు ఇప్పుడు పార్టీ మారిపోవడానికి అన్ని విధాలుగా కూడా సిద్ధమైనట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతోంది చంద్రబాబు నాయుడు వాళ్ళని ఎంతవరకు అడ్డుకోగలరు అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్తే టిడిపి మానసికంగా కూడా ఇబ్బంది పడవచ్చు.













