దాని వెనుక ఎవరు ఉన్నారో.. అందరికీ తెలుసు
అభివృద్దితో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి మొహం చూపించలేక చంద్రబాబు సభకు రావడం లేదని ప్రభుత్వ చీప్ విఫ్ ముదనూరి ప్రసాదరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చర్చ అంటూ ప్రతిపక్షం బయట సవాళ్లు విసరడం కాదు. సభకు వచ్చి చర్చించాలని కోరారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. పది గంటలకు బీఏసీ సమావేశం జరుగుతుంది. అజెండా ఫిక్స్ అవుతుంది. అనేక కీలక అంశాలను ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాము. ప్రతిపక్షాలు కూడా సభకు రావాలని నేను కోరుకుంటున్నా. సభలో ఎటువంటి చర్చకైనా మేము సిద్దం. వాళ్ల దగ్గర మాట్లాడటానికి ఏమీ లేక గైర్హాజరవుతున్నారు.
అమరావతి పాదయాత్ర ఉద్దేశ్యం ఏమిటో దాని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. ఒకసారి హైదరాబాద్ కోల్పోయిన మన రాష్ట్రం నష్టపోయింది. మళ్లీ మళ్లీ అదే తప్పు చేసేది లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. దానికోసమే మేము కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానులు పెట్టి తీరతాం అని అన్నారు.













