నా నిర్ణయాన్ని మీరు ఆమోదించడమే కాదు వీళ్లందరినీ గెలిపించాల్సిన బాధ్యత మీదే…..
“ఇదంతా మా పెద్దకొడుకే చేశాడు.
ఆయనకే మా ఓట్లు వేసి గెలిపిస్తాం.
ఇన్నాళ్లు ఆయన మా కోసం కష్టపడ్డాడు.
ఇప్పుడు ఆయన కోసం మేం కష్టపడతాం
అనే ఆలోచన అందరిలో రావాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు.
పసుపు-కుంకుమ ఆత్మస్థయిర్యం పెంచుతుంది.
కుటుంబ బాంధవ్యాలు పెంచుతుంది
ఒక అన్నగా నా చెల్లెళ్లకు పసుపు-కుంకుమ పెట్టాను.
పసుపు-కుంకుమ నిరంతరం కొనసాగిస్తాం
వసతులు లేకపోయినా మనం ఇక్కడికొచ్చాం.
అన్నివసతులను మనమే ఇక్కడ కల్పించుకున్నాం
విలాసాల కోసమే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వదలడు.
కష్టపడటం, నిర్మించడం అతనికి నచ్చదు.
అరాచకాలు,విధ్యంసాలే జగన్ కు నచ్చేవి
మీరే ఎంపిక చేసిన అభ్యర్ధులు వీళ్లంతా..
ఒకసారి కాదు అనేకసార్లు అడిగాను
ప్రతిరోజూ బూత్ కన్వీనర్లతో టెలికాన్ఫరెన్స్ లు
పార్లమెంట్ పరిధిలో సమన్వయ సభ్యులతో భేటిలు
అనేక సర్వేల ద్వారా అభిప్రాయ సేకరణ
వాటన్నింటిని క్రోడికరించి అభ్యర్ధుల ఎంపిక
వీళ్లందరినీ అత్యధిక మెజారిటితో గెలిపించాలి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయూత అందించాలి
పేదల సంక్షేమం నిరంతరం కొనసాగాలి.
ఇవన్నీ నిరంతరం కొనసాగాలంటే…ప్రజల ఆశీస్సులు టిడిపికే అందించాలి.
ఇఫ్పుడు నన్ను బలపరచాల్సిన బాధ్యత మీదే
5కోట్ల ప్రజలు అండగా ఉండాల్సిన తరుణం ఇది
మీరు ఎంపిక చేసిన అభ్యర్ధులు వీళ్లంతా
నా నిర్ణయాన్ని మీరు ఆమోదించడమే కాదు
వీళ్లందరినీ గెలిపించాల్సిన బాధ్యత మీదే
ఇది ఎన్నికల యుద్ధం..
ద్రోహులపై చేస్తున్న ధర్మపోరాటం..
భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం
అభివృద్ధి కోరేవారంతా తెలుగుదేశం వెంటే
పేదల సంక్షేమం కోరేవారంతా టిడిపితోనే













