పవన్ మౌనం వెనుక కారణం అదే…?
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన కొన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నా సరే బిజెపి కారణంగా ఓడిపోవడం అంతే కాకుండా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన సరే భారతీయ జనతా పార్టీ కారణంగా వెనక్కు తగ్గడం అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమకు ఇబ్బంది పెట్టడం వంటివి పవన్ ఏ మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీ అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ కు ఏర్పడింది అనే మాట వాస్తవం. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల విషయంలో చాలా వరకు ఆసక్తికరంగా ఉన్నారని అంటున్నారు. ప్రచారం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించడం లేదని ఆయన ప్రచారానికి రావాలి అని బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్న సరే సోము వీర్రాజు ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నా… జనసేన పార్టీ నేతలు కూడా ఇప్పుడు పెద్దగా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.
ఇక తెలంగాణలో బీజేపీ నేతలు ఆయనకు స్వయంగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధం అయిన సరే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ కూడా ఏం జరగబోతుంది ఏంటీ అనే దానిపై ముందు నుంచి అంచనాలు వేసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదని బలంగా నమ్ముతున్నారు. అందుకే ప్రచారం చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఒకవేళ కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా ఇతర రాష్ట్రాల అధ్యక్షులు ప్రచారం చేసినా ముఖ్యమంత్రి ప్రచారం చేసినా బిజెపి కలిగే ప్రయోజనం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి ప్రచారం చేస్తే పెద్దగా బిజెపి ఎక్కడ కూడా బలపడిన పరిస్థితి లేదని చెప్పాలి. తమిళనాడులో కూడా కేంద్ర మంత్రులకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అందుకే దక్షిణాదికి చెందిన కేంద్ర మంత్రులను తమిళనాడులో రంగంలోకి దించారు. బిజెపికి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ బిజెపికి దండం పెట్టే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికలు అనుభవాలు బీజేపీ నేతల వ్యవహార శైలి కూడా బీజేపీ ముందు సాక్ష్యాలతో సహా నుంచి పక్కకు రావడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.













