పక్కా ప్రణాళిక ప్రకారమే అల్లర్లు -ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ఓటేశారు : ముఖ్యమంత్రి
అమరావతి: పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన దాడులు అప్పటికప్పుడు జరిగినవి కావు -పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగాయి – ఈ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమం -ఈ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్, కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది జగన్తో పోరాడాల్సి వచ్చింది – వారికున్న అధికారాలన్నీ నీచంగా ఉపయోగించారు -రాష్ట్రాన్ని అణగదొక్కడానికి సంకల్పించారు – ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేశారు – హింస, దౌర్జన్యం వంటివి సృష్టించారు – ఉదయం 31 శాతం ఈవీఎంలు పని చేయకపోవడంతో పాటు ఒక భయానక వాతావరణం సృష్టించారు – ఒకే రోజు ఈవీఎంలు పలుసార్లు ఈవీఎంలు మొరాయించడంతో ప్రజలు పలుసార్లు కేంద్రాలకు తిరిగారు – ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఎండలను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు -యంత్రాలు పని చేయనప్పుడు మరో ఈవీఎంను మార్చడం వంటి చర్యలకు పాల్పడ్డారు – ఇందులో విశ్వసనీయత ఎక్కడుంది ? – కొన్ని చోట్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ మొదలు కాలేదు – రాత్రి 3.30 గంటలకు కూడా ఓటు వేసిన సందర్భం ఉంది – ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు జరిగాయి – ఈ చర్యలు జరిగే అవకాశముందని ముందే హెచ్చరిస్తే రాష్ట్ర ఉన్నతాధికారులందర్నీ మార్చేశారు – ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది – దీనికి సమాధానం చెప్పాలి : ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు













