తమ పార్టీకి ఓటు వేయకుంటే …పథకాలు కట్
తమ పార్టీకి ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు కట్ అవుతాయని ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం, అన్నవరం వెల్లంపేటలో గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు కట్ అవుతాయన్నారు. ఇప్పటి వరకు చోటా మోటా నాయకులే భయపెట్టేవారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే పథకాల పేరుతో బెదిరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి హక్కని ఓవైపు సీఎం జగన్ చెబుతుంటే ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.













