ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఘటన
ఎలాంటి అతుకులు లేకుండా, రంగులతో చక్రాన్ని ముద్రించకుండా కేవలం చేనేత ద్వారా ఏకవస్త్ర జాతీయ జెండా రూపొందించిన అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమరం గ్రామానికి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ ఈ ఘనత సాధించారు. నాలుగేళ్లుగా శ్రమించి జెండా తయారు చేసిన సత్యనారాయణ, చివరకు తన సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సత్య నారాయణకు ప్రశంసలు వెల్లువెత్తాయి. మాజీ ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్, సినీ నటి, చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర్ సహకారంతో సత్యనారాయణ రాష్ట్రపతిని కలిశారు.













