మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో… ఊరట
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట లభించింది. ఆయన పాస్‌పోర్టు ప్రక్రియ క్లియర్ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసులకు సంబంధం లేకుండా పాస్‌పోర్టు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. క్రిమినల్ కేసులు పెండిరగ్లో ఉన్నాయన్న కారణంగా తన పాస్‌పోర్టును పునరుద్ధరించకపోవడం సరికాదని కొల్లు రవీంద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 24 నుంచి 26 వరకు అమెరికాలో జరగనున్న మైనో ఎక్స్పో కార్యక్రమంలో తాను పాల్గొనాల్సి ఉందన్నారు. పిటిషన్ తరపున న్యాయవాది ఎంవీ రమణకుమారి వాదనలు వినిపించారు. క్రిమినల్ కేసులు పెండిరగ్లో ఉన్నాయనే కారణంతో పాస్‌పోర్ట్‌ను తిరస్కరించొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టులు పలు సందర్భాల్లో తీర్పులిచ్చాయని గుర్తు చేశారు.













