విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి : సజ్జల

కేంద్ర హోంశాఖ అజెండాలో ఏపీ విభజన సమస్యల అంశం చేర్చడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తీశ్వరస్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుతంగా పాలిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కాలని దేవుడ్ని ప్రార్థించామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం, ఎంపీల ఒత్తిడి ఫలించిందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. తెలంగాణ నుంచి ఏపీ రావాల్సినవి ఉన్నాయి. మళ్లీ న్యాయ సమీక్షకు పోకుండా సమస్యను పరిష్కరించాలన్నారు.