7 పార్లమెంట్ నియోజకవర్గాలపై తొలిదశ చర్చలు పూర్తి: CM
ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులు
7 పార్లమెంట్ నియోజకవర్గాలపై తొలిదశ చర్చలు పూర్తి: ముఖ్యమంత్రి చంద్రబాబు
అందరితో మాట్లాడి అభ్యర్ధులపై ఒక అంచనాకు వచ్చాం.
సోమవారం నుంచి 60మంది సమన్వయ సభ్యులతో భేటి
రాబోయే 6నెలలు రాష్ట్రంలో అన్నీ ఎన్నికలే
పార్టీలో అందరినీ గుర్తింపు,గౌరవం ఉంటుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు వదిలేయాలి.
రాయలసీమలో పార్టీపై పూర్తి సానుకూలత ఉంది
నీళ్లు ఇచ్చాం, పంట దిగుబడులు పెంచాం
సీమ చివరంటా కృష్ణా జలాలు తెచ్చాం.
ఊరూరా కృష్ణా జలాలకు రైతులే హారతులు
రైతుల్లో పూర్తి సానుకూలతే టిడిపికి శుభపరిణామం
సంక్షేమం పట్ల పేదల్లో పూర్తి సంతృప్తి టిడిపికి వరం
ఈ 5ఏళ్లలో మనం అన్నిపనులు బాగాచేశాం.
ప్రజలు పెట్టిన పరీక్షలు చక్కగా రాశాం. అద్భుత ఫలితాలు మనమే సాధిస్తాం.
ఏవర్గానికి ఏం మేలు చేశామో ఆయా వర్గాలకు చెప్పాలి
వ్యవసాయానికి చేసిన మేళ్లు రైతులకు వివరించాలి.
ఉపాధి కల్పనకు ఏం చేశామో నిరుద్యోగులకు చెప్పాలి
పరిశ్రమలు ఎన్నితెచ్చామో యువతకు చెప్పాలి.













