20 మంది వైసీపీ నేతలకు గన్మెన్ లు తొలగింపు
కడప జిల్లాలో 20 వైసీపీ నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్మెన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఎన్నికల సంఘం (ఈసీ)కి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ వారికి 2G2 నుంచి 4G4 వరకు గన్మెన్లను కేటాయిస్తూ ప్రతిపక్షాలకు 1G1 మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్నాని తెలిపారు. దీన్ని సరిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.













