స్ప్లిట్ కార్డులు జారీచేసే అధికారం కలెక్టర్లదే
స్ప్లిట్ కార్డులు జారీచేసే అధికారం కలెక్టర్లదే. అర్హులు అందరికీ అందజేయండి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ధాన్యం సేకరణ,చెల్లింపులు పారదర్శకంగా జరగాలి. అటు రైతులకు న్యాయం జరగాలి.ఇటు రైస్ మిల్లర్లు కూడా క్రమశిక్షణగా వ్యవహరించాలి.ఎంత ధాన్యం తీసుకున్నారో,అంత బియ్యం మిల్లర్లు ఇవ్వాలి. ఈ విధానం సక్రమంగా పాటించాలి: ముఖ్యమంత్రి
చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీలో 95% సంతృప్తి వచ్చింది: ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
ఉత్తరాంధ్ర గిరిజన ఏజెన్సీలలో కిరోసిన్ లేక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రస్తావించిన మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు.
అటువంటి కుటుంబాలు 25వేల లోపే ఉంటాయంటూ, బ్లూ కిరోసిన్ లేకపోతే వైట్ కిరోసిన్ ఇవ్వాలని,దానివల్ల సబ్సిడి రూ.2కోట్లు అయినా ఇబ్బంది లేదన్న ముఖ్యమంత్రి
కిరోసిన్ లేక కూరాకుల రైతుల సమస్యలను వివరించిన మంత్రి సుజయ కృష్ణ రంగారావు. అక్కడి రైతులు స్వయంగా మోసుకెళ్లే చిన్న పంపుసెట్లు అంటూ ఆయా రైతులు చేసేవి చాలా చిన్నచిన్న కమతాలు( పది,పదిహేను సెంట్లు) అని వివరించిన మంత్రి రంగారావు
గిరిజన తండాల్లో శాశ్వత నివాసం లేక కొండలపై తాత్కాలిక నివాసాల్లో ఉండే కుటుంబాలకు కిరోసిన్ ఇవ్వడం, సోలార్ లైట్లు పంపిణీ చేయడంపై అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించాలి. కిరోసిన్ కొరతపై ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించాలి. జనవరినుంచి గుడిసెల్లో నివాసించే గిరిజనులకు ఐటిడిఏ ద్వారా కిరోసిన్ అందించాలి: ముఖ్యమంత్రి













