దుష్టచతుష్టయం కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్దం కావాలి
ఎలక్షన్ మిషన్ 2019పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న అభ్యర్ధులు,బూత్ కన్వీనర్లు,సేవామిత్రలు
ప్రచారానికి ఇంకా 5రోజులే, పోలింగ్ కు గడువు 6రోజులే: ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రతి క్షణమూ ప్రజాభిమానం పొందేందుకే సద్వినియోగం
దేశంలో దుర్మార్గులంతా ఏకం అయ్యారు.
ప్రత్యర్ధులపై కక్ష సాధింపే లక్ష్యంగా ఏకం అయ్యారు
ఒకవైపు మోది,మరోవైపు కెసిఆర్,ఇంకోవైపు జగన్
ముగ్గురు దుష్టులూ ఆంధ్రప్రదేశ్ పై ముప్పేట దాడులు
కేంద్రం నుంచి నరేంద్రమోది టిడిపి నేతలపై ఐటి దాడులు
టిడిపి నేతలపై పాత కేసులు తవ్వితోడుతున్న కెసిఆర్
ఎన్నిదారులు ఉంటే అన్ని దారుల్లో దొంగదాడులు
యుద్దంలో సాంప్రదాయాలను పాటిస్తారు
ఈ 3 పార్టీలు యుద్ద సాంప్రదాయాలను వదిలేశాయి
ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నాయి
టిడిపి నేతల మనోనిబ్బరాన్ని దెబ్బతీసే కుట్రలు
వీళ్ల దుర్మార్గాల వల్ల తరతరాల అభివృద్ది ఆగిపోతుంది.
దుష్టచతుష్టయం కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్దం కావాలి
మన రాష్ట్రానికి, తెలుగుదశం పార్టీకి ప్రజలే రక్షకులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రక్షకులు మోది, కెసిఆర్ లే













