ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 నుంచి 2025 వరకు నంది అవార్డుల ప్రదానానికి కమిటీలను ఏర్పాటు చేసింది. స్పెషల్ అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణను నియమించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. అదే సమయంలో ఇంకా ప్రకటించాల్సి ఉన్న 2017 – 2025 సంవత్సరాల అవార్డులకు గానూ కమిటీలను ఏర్పాటు చేసింది. 2017 – 2014 మధ్యలో వచ్చిన సినిమాలలో యేడాదికి మూడు చిత్రాలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ అవార్డులు ఇవ్వబోతోంది. అలానే రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను ప్రతి యేడాదికీ ప్రకటించనుంది.
2017, 2018 కమిటీకి సీనియర్ జర్నలిస్ట్ ఎన్.సీతారామరాజు,
2019,2020 కమిటీకి దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి,
2021, 2022 కమిటీకి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు,
2023, 2024 కమిటీకి దర్శకులు రేలంగి నరసింహారావు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు ప్రతి కమిటీలోనూ ఆరుగురు సభ్యులను నియమించారు.
ఇక 2025వ సంత్సరానికి పూర్తి స్థాయిలో నంది అవార్డులను ప్రకటించబోతున్నారు. ఈ కమిటీకి దర్శకులు బి.గోపాల్ ను ఛైర్మన్ గా నియమించారు.
2025 డాక్యుమెంటరీ, ఎడ్యుకేషన్ ఫిలిమ్స్ కమిటీ ఛైర్మన్ గా టి. ప్రసన్న కుమార్ వ్యవహరిస్తారు.
2025వ సంవత్సరానికి గానూ ఉత్తమ సినీ గ్రంథం, రచయిత అవార్డుల కమిటీకి పరుచూరి గోపాలకృష్ణ ఛైర్మన్ గా, లంకా రాంబాబు వర్మ, హేమ సుందర్‌లు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు.
ఇక 2017 నుంచి 2020 వరకూ ఇవ్వబోయే టీవీ అవార్డుల కమిటీకి శింగంపల్లి శ్రుతి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.







