తన రాజీకీయ జీవితానికి అదే తొలి మైలురాయి
విద్యార్థి నాయకుడి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు తన తొలి ప్రస్థానాన్ని ఫేస్బుక్ ద్వారా పంచుకొన్నారు. తాను ఉపరాష్ట్రపతి అయినా తన గెలపు ప్రారంభమైంది నెల్లూరు జిల్లా ఉదయగిరిలోనే అని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ జీవితానికి అదే తొలి మైలురాయి అని చెప్పారు. ఆలోచించే మనషులు, సంభాషించే నోరు, పర్యటించే కాలు ఊరికే ఉండలేనన్న సామెత నా విషయంలోనూ నిజమైంది. అందుకే ఈ ఏకాంతవాసంలోనూ అందరితో ఫోన్లో మాట్లాడుతున్నారు. 1978లో జిల్లా మొత్తం కాంగ్రెస్ ప్రభంజనం వీచినా ఉదయగిరిలో నన్ను గెలిపించారు. 83లో ప్రత్యర్థి తరపున ప్రచారానికి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చినా, మరోవైపు ఎన్టీఆర్ ప్రభంజనం వీచినా ఉదయగిరి ప్రజలు నా వైపే ఉండటంతో విజయం సాధించాం. ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఉదయగిరిలో నేను పలకరించని మనిషి, ఎక్కని గడప లేదంటే అతిశయోక్తి కాదు అని చెప్పారు













