Thaman: ఓజిపై తమన్ అప్డేట్
ఎలాంటి చడీ చప్పుడూ లేకపోయినా పవన్(Pawan Kalyan) నటిస్తున్న చేతిలో ఉన్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu), ఓజి(OG) సినిమాలకు విపరీతమైన బజ్ నెలకొంది. పవన్ ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తాడా? ఎప్పుడు తమ సినిమాలను పూర్తి చేద్దామా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు. ఈ రెండింటిలో ఎక్కువ హైప్ ఉన్న సినిమా అంటే ఓజినే.
సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. టీజర్ తోనే ఎన్నో అంచనాలను పెంచేసిన ఓజి గురించి రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చాడు. ఓజి లోని ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ రెడీ అయిపోయిందని తెలిపాడు.
ఫైర్ స్టార్మ్ పేరుతో రానున్న ఓజి ఫస్ట్ సాంగ్ ను తమిళ హీరో శింబు(Simbhu) పాడాడని, సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఓజి షూటింగ్ తిరిగి మొదలయ్యాక ఆ సాంగ్ ను రిలీజ్ చేయ(OG)నున్నట్టు తమన్ తెలిపాడు. ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments)బ్యానర్ లో డీవీవీ దానయ్య(DVV Danayya) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.













