ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతివ్వాలి
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలపాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కోరారు. ఈ సందర్భంగా టీజీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీపై తెలుగు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. బీజేపీ పతనం మొదలైందని అన్నారు. టీడీపీకి సంబంధాలున్నాయని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో కేసీఆర్ చేతులు కలిపితే ఏపీకి సపోర్ట్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ మోదీ వలలో పడొద్దని సూచించారు. ప్రతిపక్షాలు విమర్శలు మానుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి రావాలని సూచించారు. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజన హామీల అమలు కోసం చర్చించారన్నారు. జగన్ తన మాట తీరును మార్చుకోవాలని అన్నారు.













