టీజీ వెంకటేశ్ మరో సంచలన ప్రకటన
తెలుగు రాష్ట్రాలలో త్వరలో బీజేపీ జెండా ఎగురుతుందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మరో సంచలన ప్రకటన చేశారు. అధికారంలో రౌడీలు, గుండాలు, ఫ్యాక్షనిస్టులు ఉంటే ప్రజలకు పనులు చేయలేరని టీజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సేవ అనేది బీజేపీ బ్లడ్‌లోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు రద్దు చేసిన జగన్.. నాలుగు ప్రణాళిక బోర్డులు తయారు చేస్తున్నారని, అందుకే నాలుగు రాజధానులు చేస్తారని అనుకుంటున్నానంటూ తన నాలుగు రాజధానులపై ప్రకటనపై వివరణ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని, కేంద్ర నాయకులతో చర్చించిన మాటలనే తాను చెప్పానన్నారు.













