ఈ నెల 25 నుంచి తిరుమలలో తెప్పోత్సవాలు
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికి వరాహ పుష్కరిణిలో 5 రోజుల పాటు నిర్వహించే తెప్పోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మార్చి 1 వరకు జరుగుతాయని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. మొదటిరోజు శ్రీరాముల అవతారంలోనూ, రెండోరోజు శ్రీకృష్ణావతారంలోనూ, తక్కిన 3 రోజులు మలయప్పస్వామి వారు తెప్పలపై విహరిస్తారన్నారు. మొదటి 3 రోజుల పాటు పుష్కరిణలో స్వామివారు మూడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దర్శనమిస్తారన్నారు. 4వ రోజు 5 ప్రదక్షిణలు, చివరిరోజు 7 ప్రదక్షిణలు ఉంటాయని వివరించారు.













