Metro project: ఏపీలో కీలక మెట్రో ప్రాజెక్టులకు.. మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్లో కీలక మెట్రో ప్రాజెక్టులకు మరో ముందడుగు పడిరది. విశాఖపట్నం(Visakhapatnam), విజయవాడ (Vijayawada) మెట్రో రైలు ప్రాజెక్టులకు శుక్రవారం టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం పనులకు తొలుత టెండర్లు పిలవనుంది. మొత్తం రూ.21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించనున్నారు. విశాఖ మెట్రో రైలుకు రూ.11,498 కోట్లతో, విజయవాడ మెట్రోకు రూ.10,118 కోట్లతో టెండర్లు (Tenders) పిలవనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు జరగనున్నాయి. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద వీఎంఆర్డీఏ నుంచి రూ.4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ (CRDA) నుంచి రూ.3,497 కోట్లు కేటాయించనున్నారు.







