వణుకుతున్న ఏపీ, తెలంగాణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో చలిపులి విసురుతోంది. చలి తీవ్రత మరింత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా విశాఖ, లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది. విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గడంతో రాత్రి సమయంలో గిరిజనులు చలికి వణికిపోతున్నారు. అరకు లోయలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతుండడంతో పాటు మంచు కూడా కురుస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకు లోయలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. చలి గాలలు బాగా వీస్తున్నట్లు వివరించారు. దట్టమైన పొగమంచు ఉంటుండడంతో ఉదయం 9 గటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.













