యువగళం పాదయాత్రకు మద్దతుగా.. సింగపూర్ టీడీపీ ఆధ్వర్యంలో
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సింగపూర్ టీడీపీ మద్దతు ప్రకటించడంతో పాటు పార్టీ పాటను సైతం రూపొందించింది. సింగపూర్ టీడీపీ కొత్తగా రూపొందించిన తెలుగుదేశం గెలుస్తోందిరా ..పాటను తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఎన్నారై టీడీపీ నేత వేమూరి రవి, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ వర్చువల్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన రావాలని దీనిలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించాలని కోరారు. సింగపూర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 200 మందికిపైగా పార్టీ అభిమానులు పాల్గొన్నారు.













