ప్రపంచ తెలుగు మహాసభలకు నాందిగా.. శోభా యాత్ర
అంతర్జాతీయ తెలుగు మహాసభల వేళ చారిత్రక నగరి రాజమహేంద్రవరంలో తెలుగు వైభవ శోభయాత్ర ఉత్సాహంగా సాగింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో మహాసభలు జరగనున్నాయి. మంగళవారం జరిగిన శోభాయాత్ర తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టింది. శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి, చైతన్య విద్యాసంస్థల చైర్మన్ చైతన్యరాజు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ పాల్గొన్నారు.













