బాబు మళ్లీ సీఎం కావాలని!
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ తెలుగురైతు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సోలికురం ఏసుదేవరెడ్డి గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీపానకాల స్వామి కొండ మెట్లను మోకాళ్లపై ఎక్కారు. మంగళవారం ఉదయం శ్రీలక్ష్మినృసింహస్వామిని దర్శించుకుని స్థానిక నాయకులతో కలిసి కొండమెట్లు ఎక్కారు. నల్గొండ జిల్లా వర్ధమానకోటకు చెందిన ఆయన తెలుగు రైతు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముళ్లపూడి వీరేంద్రనాథ్తో కలిసి వచ్చారు. ఇప్పటి వరకు 40 కొండలు మోకాళ్లపై ఎక్కినట్లు ఆయన చెప్పారు. 2018 సంవత్సరంలో వర్షాలు బాగా కురిసి రాష్ట్రం సస్యస్వామలంగా ఉండాలని, రాజధాని అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందాలని, 2019లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని శ్రీపానకాలస్వామిని కోరినట్లు చెప్పారు.













