టీడీపీ పోటీలో లేకున్నా… పరిషత్ ఎన్నికల్లో వైకాపా రిగ్గింగ్
పరిషత్ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ పోటీలో లేనప్పటికీ వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్నడూ బయటకు రాని సీఎం జగన్ టీడీపీ దెబ్బకు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నిక వైకాపా పతనానికి నాంది అని హెచ్చరించారు. వైకాపా అరాచకాలకు ఎదురొడ్డే తెలుగు తమ్ముళ్లను భవిష్యత్తులో సత్కరిస్తామన్నారు. వైకాపా అరాచకాలను సహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ధర్మపోరాటంలో టీడీపీ కార్యకర్తలే తన సైన్యమని అన్నారు.













