ఏపీ విమానాశ్రయాల్లో తెలుగులో అనౌన్స్మెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో హిందీ, ఇంగ్లీష్ తోపాటు తెలుగు కూడా అనౌన్స్మెంట్ చేస్తారని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు వెల్లడించారు. రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహిస్తున్న ఎయిర్‌లైన్స్‌లతోపాటు ఎయిర్‌పోర్టులలో కూడా తెలుగులో అనౌన్స్మెంట్లు ఉండాలని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ రాసిన లేఖకు కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు స్పందించారు. దేశంలో అనేక భాషలు ఉన్నందున అన్ని భాషలలో క్రూ సిబ్బందికి శిక్షణ ఇ్వవడం కష్టాసాధ్యమని, అందువల్లనే డొమెస్టిక్ విమానాల్లో హిందీ, ఇంగ్లీషులలో మాత్రమే అనౌన్స్మెంట్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా స్వంతంగా నిర్వహిస్తున్న విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టులలో ఇక నుంచి హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా అనౌన్స్మెంట్ ఉంటుందని ఆయన సృష్టం చేశారు.













