మహా పాదయాత్రకు తెలంగాణ వాసుల మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు తెలంగాణ వాసులు మద్దతు తెలిపారు. పాదయాత్ర తొమ్మిదోరోజైన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకోల్లు నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రకు సంఫీుభావంగా ఖమ్మం నుంచి 100 మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో అమరావతి జేఏసీ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ ప్రజలంతా యాత్రకు సంఫీుభావం తెలుపుతూ రాజధాని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు.













