ఏపీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో తెలంగాణ విభాగం కౌంటర్ వద్ద తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది పారిశుద్ధ్య కార్మికులు, పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలం, అలుపెరుగని పోరాటలతో తెలంగాణ అవతరించిందని అన్నారు. ఆరేండ్లలో తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలతో బంగారు తెలంగాణను తీర్చిదిద్దారన్నారు. ఏపీలో ఉన్నవారికి కూడా సహాయ సహకారాలు అందజేస్తున్న కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ శాఖ ఏటీఎం డీ.శ్యామ్సుందర్, ఏఎం టీ.దేవరాజు, కంట్రోలర్స్ ఎంఎం వీఎస్ బాబుతో పాటు ఏపీ ఆర్టీసీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













