గుడివాడలో వెనిగండ్ల రాము గెలుపు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నారై వెనిగండ్ల రాము విజయం సాధించారు. మాజీ మంత్రి కొడాలి నానిని వెనిగండ్ల రాము ఏకంగా 53,040 వేల భారీ మెజార్టీతో ఓడించారు. గత 20 ఏళ్లుగా విజయాలను అందుకుంటున్న కొడాలి నానికి ఈసారి గుడివాడ ప్రజలు షాకిచ్చారు. ఆయనపై పోటీ చేసిన కొడాలి నాని తొలి నాలుగైదు రౌండ్లు పూర్తికాగానే ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. 2004 నుంచి ఆయన గుడివాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొదటి రెండు పర్యాయాలు టీడీపీ నుంచి గెలిచిన నాని.. ఆ తర్వాత రెండుసార్లు జగన్ పార్టీ నుంచి తన జైత్రయాత్రను కొనసాగించారు. గుడివాడలో ఎలాగైనా నానిని ఓడిరచాలని, పసుపు జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ కొడాలి నానికి పోటీగా వెనిగండ్ల రామును రంగంలోకి దింపి విజయాన్ని అందుకుంది.







