మంత్రి లోకేష్‌కు రాఖీకట్టిన మహిళలు

వెలగపూడి సచివాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంద్భంగా మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల సజాత, టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి తదితర మహిళలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అపదలో ఉన్న మహిళలకోసం అభయ్‌హస్తమ్‌ను రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని మహిళలందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు.