టీడీపీకి నంద్యాల… వైసీపీకి లోకల్ ఎన్నికలు…!
2017 ఉప ఎన్నికల్లో నంద్యాలలో తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ నేతల్లో కాస్త ధీమా పెరిగింది అనే వ్యాఖ్యలు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి. ఈ విజయంతో 2019 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమా కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు వ్యక్తం చేశారు. అందుకే చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన మీద చాలా నమ్మకం పెట్టుకున్న కొంతమంది టిడిపి నేతలు ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడే ప్రయత్నాలు చేయలేకపోయారు.
దీని కారణంగా క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా నష్టపోయింది. రాయలసీమ జిల్లాల్లో ఉప ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు అలెర్ట్ గా లేకపోవడంతో ప్రతిపక్షంగా ఉన్న వైసిపి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ప్రజల్లోకి రాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర విజయవంతం కాలేదు. దీన్ని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది.
అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వైసీపీకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో కొంతమందిలో ధీమా పెరిగిందని… స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొంతమంది పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం లేదని పరిపాలనా వ్యవహారాల్లో కూడా జిల్లాలో కొంతమంది మంత్రులు జోక్యం చేసుకోవడం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకుని ప్రజలు ముఖ్యమంత్రి జగన్ ను గెలిపించారని కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా తమను గెలిపిస్తారు అనే ధీమా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి కొన్ని కొన్ని అంశాలలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 2017 ఉప ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం అనేది ఆ పార్టీకి అప్పుడు కలిసి వచ్చినా తర్వాత మాత్రం ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినా భవిష్యత్తులో అనుకున్న విధంగా పరిస్థితులు ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా వైసీపీ నేతలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడమే కాకుండా వాస్తవ సమాచారంతో ప్రజల్లోకి వెళ్లాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లవచ్చు.













