వారిద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి
మంత్రి పేర్నినాని, పోసాని కృష్ణ మురళిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ రెడ్డి మృతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణమని, ఆయనను ప్రధమ ముద్దాయిగా చేర్చి చార్జ్ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ వేధింపులు తట్టుకోలేకే డాక్టర్ సుధాకర్ మానసిక వేదనకు గురయ్యారన్నారు. రాజకీయ ప్రయోజనాలు కోసం వైసీపీ నేతలు మహిళల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. మంత్రి పేర్నినాని, పోసాని మాటలు జుగుస్పాకరంగా ఉన్నాయని మండిపడ్డారు.













