27, 28 తేదీల్లో… మహానాడు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‍టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని టీడీపీ పొలిట్‍బ్యూరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మహానాడును ప్రత్యక్షంగా కాకుండా గత ఏడాది నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది కూడా డిజిటల్ ప్లాట్‍ఫామ్ మీద నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పొలిట్‍బ్యూరో సమావేశం ఆన్‍లైన్‍లో జరిగింది. బనగానపల్లె మాజీ శాసనసభ్యుడు బిసి జనార్దనరెడ్డితో పాటు టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఈ సమావేశంలో ఖండించారు. కృష్ణపట్నంలో ఆనందయ్య 70 వేల మందికి మందు సరఫరా చేశాడని, ఈ మందువల్ల ప్రమాదం లేదని ఆయుష్ ప్రకటించిందన్నారు. వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడితోనే జగన్ ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేయడాన్ని పొలిట్‍బ్యూరో నిరసించింది.