టీడీపీ కీలక నిర్ణయం ?
ఎన్డీయే నుంచి బయటకు వచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో రేపు సమావేశం కానుంది. తమకు వ్యతిరేకంగా అనేక శక్తులను ప్రొత్సహించడంపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో మహాకుట్ర జరుగుతోందని, ఈ కుట్రలో భాగంగానే నిన్న పనవ్ కల్యాణ్ మాట్లాడారని టీడీపీ గట్టిగా భావిస్తోంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి మీడియా సమవేశంలో కూడా సృష్టం చేశారు. ఎన్డీయేలో ఇంకా కొనసాగడం భావ్యంకాదనే అభిప్రాయాన్ని అధికశాతం నేతలు వ్యక్తం చేశారు. జగన్, జనసేనలను బీజీపీ దగ్గరకు చేర్చుకుని ఆడిస్తున్న నాటకం కుట్రలో భాగమనే నిర్థారణకు తెలుగుదేశం నేతలు వచ్చారు. కేంద్రంలో పదవులు వదులుకుని రాష్ట్ర ప్రయోజనాలకోసం తాము పోరాడుతుంటే ఆ ఉద్యమాన్ని నీరుగాచ్చే విధంగా పవన్‌కళ్యాణ్‌తో బీజేపీ స్క్రిప్టు చదివించిందని తెలుగుదేశం అభిప్రాయపడింది. దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే భావనకు అధినేత చంద్రబాబు వచ్చారు. ఇందుకు అనుగుణంగా రేపు సాయంత్రం పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించి ఎన్డీయే నుంచి తెలుగుదేశం వైదొలుగుతోందనే నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.













