ఏపీ అసెంబ్లీ సమావేశాలపై… టీడీపీ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమాశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్గా సమావేశమైన టీడీపీ శానసభాపక్షం దీనిపై స్పష్టత ఇచ్చింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాలపై తొలుత పార్టీలో చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని, చర్చల్లో పాల్గొనాలని మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సూచించారు. దీంతో సీనియర్ నేతల సూచనల మేరకు అసెంబ్లీ సవేశాలకు హాజరు కావాల్సిందేనని నిర్ణయించారు.













