టీడీపీదే విజయం : యామిని
ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పేందుకు వంద కాదు వెయ్యి కారణాలు ఉన్నాయని, వైకాపా గెలుస్తుందనడానికి వారి వద్ద ఒక్క కారణం కూడా లేదని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ అన్నారు. రేపు లెక్కింపు కేంద్రాల వద్ద వైకాపా కార్యకర్తలు అల్లరుల సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఆమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ చూసి కేంద్రంలో గెలుపు తమదేనంటూ మోదీ సంబరపడుతున్నారని, ఎన్డీయేకు 200 సీట్లు కూడా రావని ఆమె జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పక్కాగా గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు ఈ నమ్మకాన్ని కల్గిస్తున్నాయని అన్నారు. 23 తర్వాత మోదీ శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తారని వ్యాఖ్యానించారు.













