ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడేదిలేదు
ఎలాంటి బెదిరింపులు వచ్చిన భయపడేదిలేదు. నేను ఇకపై కూడా దూకుడు గానే ఉంటానని సాధినేని యామిని శర్మ వెల్లడించారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నా పేరుతో ఫేక్ అకౌంట్లు పెట్టి తప్పుడు పోస్ట్‌లు పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ఎటువంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టలేదు అని, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. ఇక తాను ఎప్పుడూ ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్న సాధినేని యామిని నాకు, నా భర్తకు ఫోన్లు చేసి బెదిరించేలా మాట్లాడుతున్నారని, మహిళలను అణగదొక్కే ధోరణిపై తాను పోరాడుతానని ప్రకటించారు.













