మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పొన్నూరు మండలం చింతలపూడిలో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. 408,418,420,465, 471, 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు వడ్లమూడి సమీపంలో గల సంగం డెయిరీలో సోదాలు చేపట్టారు. డెయిరీ వ్యవహారాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీలో అత్యంత క్రియాశీల నేత. ఆ పార్టీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994 నుంచి 2019 వరకూ పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. 2019 లో మాత్రం ఓడిపోయారు. ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.













