టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇకలేరు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. నెల రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేష్ కార్డియాక్ హాస్పటల్లో చికిత్స కోసం చేర్చారు. అక్కడే ఆయన కన్నుమూశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు పీఏసీఎస్ అధ్యక్షుడిగా, 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్గా పని చేశారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పలువురు టీడీపీ నేతలు, నాయకులు సంతాపం ప్రకటించారు.













